పల్నాడు జిల్లాలో దారుణం

మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన టిడిపి నేతపై గొడ్డళ్లతో దాడి
ప్రాణాపాయ స్థితిలో బాలకోటిరెడ్డిని ఆస్పత్రికి తరలింపు
వైసిపి నేతల హత్యాయత్నంపై మండిపడ్డ చంద్రబాబు
శివుపాలుడిలా పాపాలు పెరిగాయన్న లోకేశ్‌
టిడిపి కూడా ప్రతీకార చర్యలకు దిగితే విూ గతేంటన్న అచ్చన్న

పల్నాడు,జూలై19(జనం సాక్షి): పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. మరో టీడీపీ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. తెలుగుదేశం రొంపిచెర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఈ దాడితో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. రొంపిచెర్ల మండలంలోని అలవల గ్రామంలో వెన్నా బాలకోటిరెడ్డి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లారు. ఈ సమయంలో బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు ఒక్కసారిగా గొడ్డళ్లతో విచక్షణ రహీతంగా దాడి చేశారు. ఈ దాడిలో బాలకోటిరెడ్డికి తీవ్ర
గాయాలయ్యాయి. గాయాలయిన బాలకోటిరెడ్డిని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో రొంపిచెర్ల ఎంపీపీగా బాలకోటిరెడ్డి పని చేశారు. ఈ దాడిపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. అలవలలో వాకింకింగ్‌కు వెళ్తున్న బాలకోటిరెడ్డి పై ప్రత్యర్థుల దాడికి పాల్పడగా.. తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ నేతలు ఖండిరచారు. ముఖ్యమంత్రి జగన్‌ఒక ఉన్మాది అని.. ఆయన ప్రోత్సాహం వల్లే.. రాష్ట్రంలో హత్యారాజకీయాలు తెరవిూదికి వస్తున్నాయని.. టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వెన్నా బాలకోటిరెడ్డి పై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిరచారు. మంగళవారం ఉదయాన్నే వాకింగ్‌ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. రాష్ట్రంలో పోలీసులు నిద్రపోతున్నారా? అని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు నేతల హత్యలకు జగన్‌ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్‌ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటు న్నారని విస్మయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారని చంద్రబాబు గద్దించారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకు ల మధ్య ఉన్న బాలాకోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగన్‌ రెడ్డే సమాధానం చెప్పాలని అన్నారు. హత్యలు దాడులతో కేడర్ని భయపెట్టాల నుకుంటున్న జగన్‌ రెడ్డికి శిశుపాలుడిలా పాపాలు పండిపోయా యని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రజావ్యతిరేకత తీవ్రం కావడంతో రాజకీయ ఆధిపత్యం కోసం చేయిస్తోన్న హత్యలు దాడులే వైసీపీ పతనానికి దారులని మండిపడ్డారు. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే జగన్‌ సర్కారుదే బాధ్యత అని అన్నారు. ప్రజావ్యతిరేకత తీవ్రం కావడంతో, రాజకీయ ఆధిపత్యం కోసం విూరు చేయిస్తున్న హత్యలు, దాడులే విూ పతనానికి దారులని లోకేశ్‌ మండిపడ్డారు. వెన్నా బాలకోటి రెడ్డిపై హత్యాయత్నం ముమ్మాటికీ విూ వైసీపీ గూండాల పనేనని ఆరోపించారు. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే..విూ రౌడీమూకలు ఎంతగా బరితెగించాయో అర్థం అవుతోంది. ఫ్యాక్షన్‌ మనస్తత్వం బ్లడ్‌లోనే ఉన్న విూ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోంది. ఇకనైనా హత్యారాజకీయాలు, దాడులు ఆపండి. లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండని హెచ్చరించారు. జగన్‌రెడ్డి అధికారం, పోలీసులు అండగా వున్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు ఇదే చివరి హెచ్చరిక. మేము తిరగబడితే, విూ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేదెవరు? అని నారా లోకేష్‌ అన్నారు. బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండిరచారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌రెడ్డి ప్యాక్షన్‌ భావాలను నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ నేతలను హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ గుండాలకు ప్రత్యేకంగా కంటికి కన్ను, పంటికి పన్ను అనే పథకం అమలు చేస్తే విూ పరిస్థితి ఏంటని
ప్రశ్నించారు. వైసీపీ మూకలు చేసే ప్రతి అరాచకానికి కర్మఫలం ఉంటుందని హెచ్చరించారు.