పల్లె ప్రకృతి వనం ను వాడకంలోకి తీసుకొని రావాలి -జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్-జూన్ 13(జనంసాక్షి)

పల్లె ప్రకృతి వనం ను వాడకంలోకి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక నర్సింహులపేట్ మండలం రామన్నగూడెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక  గ్రామంలో పర్యటించి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడి సెంటర్ లు,  పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం ను పరిశీలించి మొక్కల పెంపకం ఆశించిన మేర ఉన్నదని, మంచిగా తయారు చేశారని, ప్రజలు వాడుకునే విధంగా చూడాలని తెలిపారు.  గ్రామ పంచాయతీ సమావేశం, చిన్నపాటి సమావేశాలు పల్లె ప్రకృతి వనంలో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలు విస్తృతంగా వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి సెంటర్ లను తనిఖీ చేస్తూ, పిల్లల హాజరు శాతం పెంచాలని, గ్రామంలోని బాలింతలు, గర్భిణీ లు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నార అని అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహార లోపం ఉన్న వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, బరువు కొలిచే వేయింగ్ మెషీన్  మరమ్మతులు చేపట్టి రోజువారి బరువు కొలవాలని, వయస్సుకు తగ్గ బరువు లేని పక్షంలో జాగ్రత్తలు తీసుకొని, రోజు వారి పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలని, పాలు, గ్రుడ్లు, బాలమృతం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలతో మాట్లాడారు. రిజిస్టర్ ను పరిశీలించి సూపర్వైజర్ విజయ తో పర్యవేక్షణ చేయాలని తెలిపారు. సర్పంచ్, అదికారులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు.చొరవ తీసుకొని గ్రామంలోని తల్లిదండ్రులతో సర్పంచ్, సూపర్ వైజర్, పాఠశాల హెచ్.ఎం. మాట్లాడి చిన్న పిల్లలు అంగన్వాడి సెంటర్ లో, బడి ఈడు పిల్లలు పాఠశాలలో ఉండేవిధంగా, బడి బయట ఎవ్వరూ ఉండకుండా చూడాలని తెలిపారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ప్రధానోపాద్యాయులు శ్రినయ్య తో మాట్లాడుతూ, పిల్లల హాజరు పెంచాలని, గ్రామంలోని పిల్లలు ప్రైవేట్ బడుల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందిస్తున్న వివరాలను తెలిపి గ్రామంలోని పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరేటట్లు చూసి హాజరు శాతం పెంచాలని తెలిపారు. అనంతరం వైకుంఠ ధామం పరిశీలించి, ఏర్పాటు చేసిన పంపును ఎత్తు పెంచి ఏర్పాటు చేయాలని, అలాగే కట్టెలు ఉంచుకోనుటకు స్టోర్ రూం ఏర్పాటు చేయాలని, నీడ వచ్చే విధంగా షెడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడుతూ రోజు వారి చెత్త సేకరణ జరగాలనీ, గ్రామంలోని 366 ఇళ్ల నుండి రోజువారి చెత్త సేకరణపై, గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలపై షెడ్యూల్ రూపొందించుకొని ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, డి.పి.ఓ. సాయిబాబా, ఎంపీడీవో, తహశీల్దార్ విజయ్ కుమార్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.