పల్లె ప్రగతి తో తండాల అభివృద్ధి

పెద్దవంగర జూన్ 13(జనం సాక్షి )పల్లె ప్రగతితో తండాల రూపురేఖలు మారుతున్నయని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి  తెలిపారు
ఎర్రబెల్లి దయాకర్ రావు  రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గ్రామీణా నీటి సరఫరా శాఖ మంత్రి  సహకారలతో తండాలకు లింక్ రోడ్స్   మరియు బిటి రోడ్సు తండాలకు రవాణా సౌకర్యాలకు మరియు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తున్న ఘనత మంత్రి దేనని ఎంపీపీ  అన్నారు
సోమవారం పల్లె ప్రగతి ప్రోగ్రామ్ లో భాగంగా రెడ్డికుండా తండ గ్రామ పంచాయితీ లో జరుగుచున్న ఎంపీపీ నిధుల నుండి పార్మిమేషన్ రోడ్డు పనులను జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు జాటోత్ నెహ్రూ ఎంపీటీసీ సభ్యులు భానోతు రవీందర్ నాయక్ తో కలిసి పరిశీలించారు తర్వాత సర్పంచ్ కుంటలో జరుగుచున్న   ఈజీఎస్ఉపాధి హామీ పనుల తీరును పరిశీలించారు,తర్వాత  ఈజీఎస్ కూలీలతో మాట్లాడుతూ కూల్లు పడుతున్నాయని,డబ్బులు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు కూలీలతో కలిసి మట్టి ట్రాక్టర్ లో డబ్బాతో పోసినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సర్పంచ్ భానోతు జగ్గునాయక్,ఉప సర్పంచ్ కోబులా,పంచాయితీ కార్యదర్శి నరసింహ స్వామి,తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆంగోతు సీత్య నాయక్,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి భానోతు సోమన్న,వార్డు సభ్యులు బొజ్జ నాయక్,దళపతి,భానోతు సోమాని తదితరులు పాల్గొన్నారు