పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధి -మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 7(జనంసాక్షి)

పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి దిశలో గ్రామాలు ప్రగతి సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో 21కోట్ల 26 లక్షల రూపాయల తో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి సత్యవతి రాథోడ్, ఎం పి మాలోతు కవిత,  జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, స్థానిక శాసనసభ్యురాలు హరిప్రియ, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. మండల కేంద్రంలోని గ్రామీణ క్రీడా ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 5వ విడత పల్లె ప్రగతి బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, బయ్యారం మండలం పల్లె ప్రగతి లో ఆదర్శప్రాయంగా పనులను నిర్వహిస్తున్నారని, వైకుంఠధామం వాడుతున్నారని, 100% ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్లైన్ వేసి నీరు అందించాలని, ప్రతి ఇంటికి రోజు చెత్త సేకరణ జరగడం లేదని తెలుసుకుని బయ్యారం గ్రామానికి అదనంగా 1 ట్రాక్టర్ ను మంజూరు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. ఎరువులు కంపోస్టు యార్డు ద్వారా 12 వేలు, ఉపాధి హామీ పనుల కింద ట్రాక్టర్ కు నీటి ద్వారా 2లక్ష ల 91వేలు, ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణతో 1లక్ష16 వేల ఆదాయం సమకూర్చడం జరిగిందని, 80% గ్రామంలో నీరు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. బయ్యారం మండలానికి 29 కోట్ల స్త్రీ నిధి లోన్స్ అందించి మహిళలకు సమాజంలో గౌరవం పెంచి, ఆర్థికంగా బలోపేతానికి కృషి చేస్తున్నామని, ఇంకా 40  కోట్లు స్త్రీ నిధి మంజూరు చేయనున్నట్లు వారు ఉత్పత్తులను ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి 3 లక్షల చొప్పున సహాయం అందజేస్తామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర నిధుల కింద 1400 వందల కోట్ల రూపాయలు సిసి రోడ్ల పనులకు రావాల్సి ఉండగా కేవలం 300 వందల కోట్లు మాత్రమే మంజూరు చేసి తెలంగాణపై వివక్ష చూపిస్తోందని అన్నారు. పల్లె ప్రగతి లో జిల్లా యంత్రాంగమంతా కూడా ఆదర్శంగా గ్రామాలను అన్ని విధాలుగా  ప్రగతి లో ముందుకు తీసుకు పోతున్నారని వారిని అభినందిస్తున్నానని అన్నారు. వైకుంఠధామం డంప్ యార్డ్ కు మొదటి ప్రాధాన్యత కల్పించాలని, రాంపూర్ బ్రిడ్జికి 10 కోట్లు, ఇల్లందు నియోజక వర్గానికి 5 కోట్లు, బయ్యారం మండల కేంద్రానికి అదనంగా 1 కోటి రూపాయలు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోబోతున్నామని వరాల జల్లు కురిపించి పల్లె ప్రగతి కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించాలని అధికారులను కోరారు. రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, ఈ ప్రాంత రుణం తీర్చుకొనేందుకు మేమంతా మమేకమై ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములమైతామని బయ్యారం గార్ల మండలాలకు ఎస్సారెస్పీ నీరు అందక పోవడం వలన  మండలం లో సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వం మ్యాపింగ్ మార్చడం వల్ల ఇంకా వెనకబడ్డామని, ఇల్లందు నియోజకవర్గానికి చుక్కనీరు రావడం లేదని, బయ్యారం చెరువును రిజర్వాయర్గా మార్చుకొని రెండు లిఫ్ట్ ఇరిగేషన్ లు అవసరమని, దానికి కృషి చేయాలని, మెట్ల తిమ్మాపురం గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం ,రోడ్డు మంజూరు ప్రతి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఉండేట్లు ప్రతిపాదనలు పొందుపరచడం జరుగుతుందని, గూడా లను గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకొని 25 లక్షల చొప్పున గ్రామ పంచాయతీ లకు అందజేస్తున్నట్లు, మండలంలో కరెంటు సమస్య ఉన్న గ్రామాలకు వాటి పరిష్కార మార్గాలు చూపుతున్నట్లు, త్వరలో పోడు భూముల సమస్యలను తీర్చనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా 461 గ్రామపంచాయతీలో పల్లె ప్రగతి నిర్వహిస్తున్నట్లు, పల్లె ప్రగతి లో వచ్చిన నిధులు, వాటి వినియోగం నివేదికలతో ప్రతి గ్రామ పంచాయతీ ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగిందని, బయ్యారం ఇతర మండలాలకు ఆదర్శంగా ట్రాక్టర్ ద్వారా ఆదాయం సంపాదిస్తు పలు అంశాల్లో ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి దయాకర్ రావు గారు చెప్పినట్లుగా అదనంగా ఒక ట్రాక్టర్లు ఇస్తే జిల్లాలో ఒకే గ్రామపంచాయతీ రెండు ట్రాక్టర్ లు ఉన్న జి పి గా ఉంటుందని, ప్రతి ఇంటికి రోజు చెత్త సేకరణ జరిగే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనుల్లో బయ్యారం నుండి  214 రూపాయలను జిల్లాల్లో అధికంగా వర్కర్లు ఈ మండలం నుండి పొందుతున్నారని, పరిశుద్ధ నీటి వసతి,  హరితహారం మొదలైన కార్యక్రమాలు, పల్లె ప్రగతి లో 18వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించి సమస్యలపై దృష్టి సాధిస్తామని కలెక్టర్ తెలిపారు. స్థానిక శాసనసభ సభ్యురాలు బానోత్ హరిప్రియ మాట్లాడుతూ, చీకటి వెలుగులు దుర్భరమైన స్థితిలో 70 ఏళ్ల గత పాలనలో మగ్యామని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక స్వరాష్ట్రంలో అన్ని దిశలో అభివృద్ధి చేసుకుంటున్నామని బయ్యారంలో 4 కోట్ల 72 లక్షల తో ఓ.హెచ్.ఎస్. ఆర్,  పైప్లైన్ లను వేసుకొని మిషన్ భగీరథ నీరు ను ప్రతి గడపకు అందిస్తున్నామని, ప్రతి గ్రామం పచ్చని చెట్లతో ప్రగతిలో ముందుకు సాగుతున్నాయని, దళిత బంధు మొదటి విడతలో నియోజకవర్గానికి 100 యూనిట్లు వస్తే 56 యూనిట్లను గౌరారం గ్రామానికి అందజేయడం జరిగిందని, 35 కిలోమీటర్ల పరిధిలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వాటికి డబుల్ రోడ్డు మంజూరు చేయాలని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరగాలని, పల్లె ప్రగతి ని సమిష్టిగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా నిర్వహించు కుందామని 21కోట్ల 26లక్షల తో నేడు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జెడ్పి చైర్ పర్సన్ అంగోతు బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, సర్పంచ్ కోటమ్మ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, పిఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు, జడ్పీ సీఈఓ రమాదేవి, వివిధ శాఖల జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు