పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుడికందుల సత్యం

కరీంనగర్ టౌన్ నవంబర్ 21(జనం సాక్షి)
నవంబర్ 20వ తేదీన నల్లగొండ జిల్లాలో తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (CITU) రాష్ట్ర ప్రథమ మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుడికందుల సత్యం ఎన్నికయ్యారని రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తెలిపారు.
నల్లగొండ జిల్లాలో రాష్ట్ర ప్రథమ మహాసభలు ఘనంగా జరిగాయి.మూడు సంవత్సరాల ఉద్యమ చరిత్రను సమీక్షించుకొని, రానున్న మూడు సంవత్సరాల కాలంలో పవర్ లూమ్ వర్కర్స్,చేనేత కార్మిక సమస్యలపై భవిష్యత్ కర్తవయ్యాలను రూపొందించుకొన్నారు. అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
నూతన రాష్ట్ర కమిటీ లో
జిల్లాకు చెందిన మారంపల్లి నాగభూషణం(చొప్పదండి) ఎలిగేటి కృష్ణహారి (చొప్పదండి)దూడం గంగాధర్ (చామనపల్లి) రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించారు.
ఈ సందర్భంగా గుడికందుల సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పవర్ లూమ్ వర్కర్స్, చేనేత కార్మిక సమస్యలపై ఉద్యమిస్తామని తెలిపారు.