‘పశ్చిమ’లో భారీ వర్షం
ఏలూరు, ఆగస్టు 2 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 5.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్ డైరెక్టరు శ్రీ కె. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తాళ్లపూడి మండలంలో 22.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. కాగా జీలుగుమిల్లిలో 9.8, బుట్టాయిగూడెంలో 12.8, పోలవరంలో 3.4, గోపాలపురంలో 11.4, కొయ్యల గూడెంలో 13.4, జంగారెడ్డి గూడెంలో 6.2, చింతలపూడిలో 3.8, కామవరపు కోటలో 2.2, ద్వారకా తిరుమలలో 1.2, నల్లజర్లలో 2, దేవరపల్లిలో 5.8, చాగల్లులో 7.4, కొవ్వూరులో 15.2, నిడదవోలులో 6.2, తాడెపల్లి గూడెంలో 2.6, ఉంగుటూరులో 1.8, భీమడోలులో 5.2, పెదవేగిలో 13.8, పెదపాడు, ఏలూరులో 6.6, దెందెలూరులో 4.2, నిడమర్రులో 9.2, గణపవరంలో 3.6, పెంటపాడులో 2, తణుకులో 5.4, ఉండ్రాజవరంలో 4.4, పెరవలిలో 3.8, అత్తిలి, ఇరగవరంలలో 5.2, ఉండిలో 2.6, ఆకివీడు, కాళ్లలలో 3.4, భీమవరంలో 4.2, పాలకోడేరులో 2.4, వీరవాసరంలో 6.2, పెనుమంట్రలో 3.8, పెనుగొండలో 5.6, ఆచంటలో 5.2, పోడూరులో 2.6, పాలకొల్లులో 8.2, యలమంచిలిలో 9.2, నరసాపురం మండలంలో 2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదయింది.