పసుపు రైతు కుదేలు


నిజామాబాద్‌,మే14(జ‌నం సాక్షి):పసుపు పంట కొనుగోళ్లకు రాష్ట్రంలోనే నిజామాబాద్‌ యార్డే ప్రధాన మార్కెట్‌ కేంద్రం కావడంతో ఈ యేడు పంట భారీగా తరలివస్తోంది.  జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాల రైతులు కూడా ఇక్కడికే పంట తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఇప్పుడిప్పుడే ఆమ్‌చూర్‌ పంట కూడా భారీగా తరలివస్తోంది. ఈనేపథ్యంలో ఇంకా పసుపు పంట పూర్తిగా కొనుగోళ్లు జరగకపోవడంతో మార్కెట్‌ వ్యవసాయోత్పత్తులతో కిక్కిరిసిపోతోంది. గత రెండున్నర నెలలుగా పసుపు విక్రయాలు జరుగుతున్నా ఇంకా పాతిక శాతం పంట రైతుల వద్దే ఉండిపోయింది. మొదట్లో ఉన్న ధర ఇప్పుడు లేకుండాపోయింది. దాదాపు క్వింటాలుకు రూ. 2 వేల వరకు తగ్గిపోయింది. సరుకు ఎక్కువగా మార్కెట్‌కు వచ్చిందనే బూచి 

చూపి వ్యాపారులు ధరలను ఆమాంతం తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.