పాంటింగ్ తప్పుకొంటే సచిన్ తప్పుకోవాలా..? మాస్టర్‌కు మద్దతుగా సీనియర్లు
న్యూఢిల్లీ ,నవంబర్ 30: అంతర్జాతీయ క్రికెట్‌కు రికీ పాంటింగ్ గుడ్‌బై చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టీ సచిన్‌పై పడింది. వరుస వైఫల్యాలతోనే పాంటింగ్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని గౌరవాన్ని నిలుపుకున్నాడని పలువురు విశ్లేషిస్తున్నారు. సచిన్ కూడా అదే బాటలో నడవాలని సూచిస్తున్నారు. అయితే భారత జట్టు ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం దీనిని కొట్టిపారేశాడు. పాంటింగ్ తప్పుకుంటే… సచిన్ కూడా తప్పుకోవాలని నిబంధన ఉందా అంటూ ప్రశ్నించాడు. ఏ ఒక్కరినీ రిటైర్మెంట్‌పై ఒత్తడి చేయ కూడదని , ఎప్పుడు తప్పుకోవాలని వారికే వదిలే యాలని అభిప్రాయపడ్డాడు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని చెప్పాడు. రెండు వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తులను ఏ విధంగా పోల్చి చూస్తారని ప్రశ్నించాడు. కొన్ని వైఫల్యాల కారణంగా 23 ఏళ్ళ సచిన్ కెరీర్‌ను మరిచిపో తున్నారని , అతని రికార్డుల ను పక్కన పెట్టి విమ ర్శలు గుప్పించడం సబబు కాద ని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఇంకా పరుగులు చేసే సత్తా సచిన్‌లో ఉందని చెప్పాడు. అటు పంటర్ రిటై ర్మెంట్‌పై కూడా గంభీర్ స్పందించాడు. ఆసీస్ క్రికెట్‌లో గొప్ప కెప్టెన్‌గా పాంటింగ్‌ను అభివర్ణిం చాడు. మూడు ఫార్మేట్లలోనూ రికీ గణాంకాలు చూస్తే చాలని వ్యాఖ్యానించాడు.