పాకిస్తాన్‌కు సరబ్ కుటుంబ సభ్యులు
పాకిస్తాన్: పాక్ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సరబ్‌జిత్ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉంది. కాగా సరబ్‌ను చూసేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనకు భారత ప్రభుత్వం స్పందించి పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్ ద్వారా పాక్ అధికారులతో సంప్రదించి, సరబ్ కుటుంబ సభ్యులు లాహోర్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సరబ్ ఇద్దరు కుమార్తెలు, భార్య, సోదరి లాహోర్‌కు బయలుదేరనున్నారు. ప్రస్తుతం సరబ్‌జిత్ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ ద్వారానే ఆయనకు శ్వాస అందిస్తున్నారు. సరబ్‌జిత్‌సింగ్ కోలుకోవాలని అమృత్‌సర్‌లో బంధువులు, శ్రేయోభిలాషులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.