పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల కిరాతకం
ప్రయాణికులపై దుండగుల కాల్పులు
23 మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు
లాహోర్,ఆగస్ట్26 (జనం సాక్షి): పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్ లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్ విూడియా సంస్థ వెల్లడిరచింది ముసాఖెల్ జిల్లాలోని రరాషమ్‌లోని రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు సాయుధులు దారిని అడ్డగించి, అటుగా వస్తోన్న బస్సులు, ట్రక్కుల్లో నుంచి ప్రయాణికుల్ని దింపి, వారి గుర్తింపు తనిఖీ చేశారు. తర్వాత వారిపై కాల్పులు జరపడంతో 23 మంది మృతి చెందారు. అంతేగాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు విూడియా పేర్కొంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిరచారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. గతేడాది అక్టోబర్‌లో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలను గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు. బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలో ఆ దారుణం చోటుచేసుకుంది. అవి లక్షిత హత్యలని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. 2015లో జరిగిన ఘటనలో 20 మంది నిర్మాణ రంగ కార్మికులు కన్నుమూశారు.