పాకిస్థాన్‌పై అమెరికా ప్రేమ
పాకిస్థాన్‌పై తనకున్న ప్రేమను అమెరికా మరోమారు బయటపెట్టింది. ఆ దేశానికి వివిధ రూపాల్లో రూ.6121 కోట్ల సాయం అందించాలన్న రక్షణ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ను సమూలంగా తుడిచిపెట్టేందుకు పాక్ చర్యలు తీసుకుంటుందన్న ఉద్దేశంతోనే ఈ సాయానికి అమెరికా మొగ్గు చూపినట్టు సమాచారం. అమెరికా అందించనున్న సాయానికి అమెరికా నేషనల్ డిఫెన్స్ అథరైజేషన్ యాక్ట్-2017కు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం కూడా తెలిపింది. వివిధ దేశాలకు అమెరికా మొత్తం రూ.7481 కోట్లు సాయం చేస్తుంటే ఒక్క పాకిస్థాన్‌కే ఏకంగా రూ.6121 కోట్లు ఇవ్వనుండడం గమనార్హం. తాజా బిల్లు వచ్చే వారం సెనేట్ ఆమోదం కోసం రానుంది.