పాకిస్థాన్‌లో మూడోసారీ నవాజ్‌దే గెలుపు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో నిన్న జరిగిన ఎన్ని జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ 125 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో మూడోసారి నవాజ్ షరీఫ్ ఆ దేశ ప్రధాని కానున్నారు. పాకిస్థాన్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నవాజ్ షరీఫ్ గతంలో 1990-1993, 1997-1999 మధ్య ప్రధానిగా పనిచేశారు. 1999లో భారత్‌తో శాంతి చర్చలకు చొరవ చూపారాయన. ప్రచార సమయంలో యువతకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేరుస్తానని నవాజ్‌షరీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 32 స్థానాల్లోనే గెలిచిన పీపీసీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ 37 సీట్లతో ప్రతిపక్ష హోదా సంపాదించుకుంది.