పాకిస్థాన్‌ ఓ అద్భుతమైన దేశం – ట్రంప్ !!!

 Donald Trump Hosts Nevada Caucus Night Watch Party In Las Vegasవివాదస్పద వ్యాఖ్యలతో ఏఖంగా అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంఫ్. తాజాగా ఇతను పాకిస్తాన్ గురించి మాట్లాడారు. పాక్‌ సమస్యల పరిష్కారానికి తాను ఏ పాత్ర పోషించడానికైనా సిద్దమని తెలియజేశారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రంప్‌కు పాకిస్తాన్‌పై వల్లమాలిన అభిమానం కలగడానికి కారణాలు తెలియరాలేదు. గతంలో పాకిస్తాన్ వల్లే ఉగ్రవాదం పెరిగిపోతుందని తాను అధ్యక్షుడనైతే ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తానని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఏ ఒక్క ముస్లింను కూడా అమెరికాలో అడుగుపెట్టనివ్వనని ఘటైన వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్‌ సమస్యల్ని పరిష్కరించడానికి నేను సిద్ధం. నేనెలాంటి పాత్ర పోషించాలని మీరు కోరుకున్నా దానిని నేను గౌరవంగా, వ్యక్తిగత పనిగా భావించి పూర్తిచేస్తా. మీరెప్పుడైనా ఫోన్‌ చేయవచ్చు’ అని షరీఫ్‌తో ట్రంప్‌ చెప్పినట్లు పాక్‌ వెల్లడించింది. షరీఫ్‌కు ఎంతో మంచి పేరుందని ట్రంప్‌ పేర్కొన్నట్లు తెలిపింది. ‘మీరో అద్భుతమైన నేత. మంచి పనులు చేస్తున్నారు. మీతో మాట్లాడుతుంటే ఎంతోకాలం నుంచి పరిచయం ఉన్నవారితో మాట్లాడుతున్నట్లే అనిపిస్తోంది’ అని ట్రంప్‌ చెప్పినట్లు తెలిపింది. పాకిస్థాన్‌ ఓ అద్భుతమైన దేశమనీ, అపారమైన అవకాశాలున్నాయనీ ట్రంప్‌ పేర్కొన్నారు. పాక్‌ ప్రజలు ఎంతో తెలివైనవారని కొనియాడారు. ‘మీది అద్భుతమైన దేశం. అద్భుతమైన ప్రజలు’న్న పాకిస్థాన్‌కు రావడం తనకెంతో ఇష్టమని ఆయన షరీఫ్‌ ఆహ్వానానికి బదులిచ్చారు. షరీఫ్‌ను ట్రంప్‌ పొగిడినట్లు అమెరికా ప్రకటనలో లేనేలేదు..! పాక్‌పై పొగడ్తల విషయాన్ని అమెరికా ప్రసార మాధ్యమాలూ విశ్వసించడం లేదు.