పాకిస్థాన్ లక్ష్యం 238

పాకిస్థాన్ లక్ష్యం 238
 నేపియర్: ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్ 238 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్కు నిర్దేశించింది. గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ పూర్తి ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.

ఐర్లాండ్ కెప్టెన్ పోర్టర్ఫీల్డ్ (107) సెంచరీతో్ రాణించి జట్టును ఆదుకున్నాడు. కాగా ఇతర ఐర్లాండ్ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఐర్లాండ్ను కట్టడి చేశారు. పాక్ బౌలర్లు సొహైల్ ఖాన్, రహత్ అలీ, వాహబ్ రియాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.