పాక్లో మళ్లీ బాంబు పేలుడు ..15మంది మృతి
హైదరాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో ఓ పోలియో కేంద్రం సమీపంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15మంది మృత్యువాతపడ్డారు. మరో 20మందికి గాయాలైనట్లు సమాచారం. పోలియో కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో 12మంది పోలీసులు, ఒక పారామిలిటరీ అధికారి, ఇద్దరు సామాన్య ప్రజలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.