పాక్‌లో అమెరికా ఎయిర్‌ బాంబింగ్‌

తాలిబాన్‌ నం.2 వలి`ఉర్‌`రహ్మాన్‌తో సహా పలువురి మృతి
ఇస్లామాబాద్‌,మే 29 (జనంసాక్షి) : తాలిబన్‌ అల్‌ఖైదా ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌లోని ఉత్తర వాజిరిస్తాన్‌ గిరిజన  ప్రాంతంపై అమెరికా దృష్టిసారించిం ది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ( సీఐఏ ) ఆధ్వర్యంలోని పైలట్‌ రహిత గూఢచా రి విమానాలు బుధవారం తెల్లవారు జామున ఇక్కడి చష్మాపూల్‌లోని ఓ మిలిటెంట్‌ స్థావరంపై మెరుపు దాడు లు నిర్వహించాయి. ఈ ఘటనలో పాకిస్తాన్‌ తాలిబన్‌ నెంబర్‌ ` 2 డిప్యూటీ కమాండర్‌ వలి ఉర్‌ రెహ్మాన్‌ మరో ఆరుగురు మృతిచెందినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇదే ఘటనలో మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సాధారణ ఎన్నికల అనంతరం పాకిస్తాన్‌లో ఈ దాడులు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఉగ్రవాద కుట్రలను ముందుగానే పసిగట్టి, సామాన్య ప్రజలను రక్షించడమే లక్ష్యంగా     పైలట్‌ రహిత వైమానిక దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా ఈ దాడులను ప్రధాని పీఠం అధిరోహించనున్న సీఎంఎల్‌ ( ఎన్‌ ) నేత నవాజ్‌ షరీఫ్‌, పాకిస్తాన్‌ విదేశీ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌ జిలానీలు ఖండిరచారు. అమెరికా మెరుపు దాడులకు అమాయక ప్రజలు బలవుతున్నారని, ఇవి ప్రతి చర్యకు తావిచ్చేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రహస్య దాడులు చట్టవిరుద్ధమని, త్వరలోనే దీనికి పరిష్కారం కనుగొంటామన్నారు. కాగా తమ అగ్రనేత మరణించిన విషయాన్ని పాకిస్తాన్‌ తాలిబన్‌ ప్రతినిధులు ధ్రువీకరించలేదు.