పాక్‌లో బాంబు పేలుడు

ఇస్లామాబాద్‌:పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరం శివార్లలోని మార్కెట్‌ వద్ద శుక్రవారం ఉదయం శక్తివంతమైన బాంబు పేలటంతో ఆరుగురు మరణించారు.మరో 12 మందికి గాయాలయ్యాయి.వీరిలో అవామీ నేషనల్‌ పార్టీ నేత కూడా ఉన్నారు.కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న ఏఎన్‌పీ కుచ్లక్‌ బజార్‌ వద్ద నిర్వహించిన ర్యాలీ వేదికకు సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించింది మరణించినవారిలో ఏఎన్‌పీ అనుబంద పష్తూన్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ప్రాంతీయ ఉపాధ్యక్షడు మాలిక్‌ ఖాసిమ్‌తో పాటు 5ఏళ్ల బాలిక కూడా ఉంది.బాంబు పేలుడు తర్వాత కాల్పులు కూడా జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.బాంబను సైకిల్‌కు అమర్చారని అధికారులు తెలిపారు.ఈ పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు,భవనాలు దెబ్బతిన్నాయి.పాకిస్థాన్‌ ప్రధానమంత్రి రాజా పర్వేజ్‌ అష్రాప్‌ పర్యటనకు కొన్ని గంటల ముందు జరిగిన ఈ పేలడు బాద్యులుగా ఎవరూ ప్రకటించుకోలేదు.