పాక్‌లో 12 మంది ఉరితీత
పాకిస్థాన్ లోని వివిధ జైళ్లలోని మొత్తం 12 మంది ఖైదీలను ఉరి తీశారు. పంజాబ్ ప్రావెన్స్ జంగ్ జిల్లా జైలులోని క్రిమినల్స్ ముబాషిర్, షరీఫ్, రియాజ్ ను ఉరి తీశారు. వీరు హత్య కేసులో జంగ్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మహిళ హత్య కేసులో నిందితుడైన జాఫర్ ఇక్బాల్ ను పంజాబ్ ప్రావెన్స్ మేయిన్ వాలి జిల్లా జైలులో ఉరి తీశారు. అలాగే దోపిడి కేసులో అరెస్ట్ అయిన ఫజల్, ఫైసల్ ను సింధు ప్రావెన్స్ లోని కరాచీ సెంట్రల్ జైల్లో ఉరి శిక్ష అములు చేశారు. మలిక్ నదీమ్, మహమ్మద్ జావెద్ లకు ఉరి వేశారు. అలాగే చిన్నారిపై హత్యాచారం చేసిన జాఫర్ ఇక్బాల్ కు ముల్తాన్ సెంట్రల్ జైల్లో ఉరి వేశారు. చేశారు. హత్య కేసులో మహమ్మద్ ఇక్బాల్ ను గుర్జన్ వాలా సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. పౌరుడి హత్య కేసులో అరెస్ట్ అయిన మహమ్మద్ నవాజ్ ను ఫైసలాబాద్ సెంట్రల్ జైల్ ఉరి తీశారు.