పాక్ కాల్పుల్లో జవాన్ మృతి
శ్రీనగర్,నవంబర్10(జనంసాక్షి): సరిహద్దులో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం ఉదయం 9:45 గంటలకు సుందర్‌బానీ సెక్టార్‌లో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్ జవాను గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన జవాన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.


