పాక్ క్రికెటర్ ఆసిఫ్ అలీ కూతురు మృతి
క్యాన్సర్తో అమెరికాలోమృతి చెందిన చిన్నారి
ఇస్లామాబాద్,మే20(జనంసాక్షి): పాక్ క్రికెటర్ ఆసిఫ్ అలీ (27) కుమార్తె నూర్ ఫాతిమా (2) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. స్టేజ్-4 క్యాన్సర్తో ఫాతిమాలో అమెరికాలో ఓ ఆస్సత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫాతిమా చనిపోయిదంటూ పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రాంచైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ ట్విట్టర్లో వెల్లడించింది. తన కుమార్తె క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతోందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థించాలని గత నెలలో ఆసిఫ్ తన ట్విట్టర్లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆసిఫ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డేలో సిరీస్ లో పాక్ తరుఫున ఆసిఫ్ ఆడుతున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో ఇంగ్లాండ్ ఇప్పటికే 4-0 ముందంజలో ఉంది. తన కూతురు చనిపోయిందనగానే ఆసిఫ్ ఇంగ్లాండ్ నుంచి అమెరికా పయనమయ్యాడు. ఫాతిమా మృతిపై పాకిస్థాన్ ప్రజలు, క్రికెట్ అభిమానులు సంతాపం తెలపడంతో పాటు సానుభూతి ప్రకటించారు.