పాక్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ అరెస్టు
– ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
– ఇస్లామాబాద్‌లోని అడియాలా జైలుకు తరలింపు
– దేశ భవిష్యత్తును మార్చేందుకు ప్రజలు కదిలిరావాలి
– అరెస్టుకు ముందుకు ప్రజలుకు పిలుపునిచ్చిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
అబుదాబి, జులై13(జనం సాక్షి) : అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పాక్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. లండన్ నుంచి అబుదాబి విూదుగా లా¬ర్‌కు సాయంత్రం 6.15 గంటలకు చేరుకున్నారు. స్వదేశానికి వచ్చిన అతన్ని, కూతురు మరయంలను అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకొన్నారు. అక్కడ నుండి స్లామాబాద్‌లోని ఆడియాల జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు లా¬ర్‌లో పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని మోహరింపజేశారు. దాదాపు పది వేల మంది అదనపు బలగాలతో పాటు వారిని జైలుకు తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఉపయోగించారు.
అవినీతి కేసులో షరీఫ్‌కు పదేళ్ల జైలు శిక్ష పడగా, మరయంకు ఏడేళ్ల శిక్ష పడింది. గత వారం కోర్టు వీరికి
శిక్షలను ఖరారు చేసింది. షరీఫ్ సాయంత్రం ఎయిపోర్టుకు వస్తారనే సమాచారంతో ఇప్పటికే షరీఫ్ కోసం పాకిస్థాన్ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో అధికారులు లా¬ర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎదురుచూస్తూ వచ్చారు. ఒకవేళ ఏదైనా కారణంతో విమానాన్ని ఇస్లామాబాద్ విమానాశ్రయానికి మళ్లిస్తారేమోనని అనుమానంతో కొందరు అధికారులు అక్కడికి కూడా తరలించారు.
నగరంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నగరంలో మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రజలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని ఆజ్ఞాపించారు.
దేశ భవిష్యత్తును మార్చేందుకు ప్రజలు కదిలిరావాలి – షరీఫ్
దేశ భవిష్యత్తును మార్చేందుకు జనం కదిలిరావాలని మాజీ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. నేనేం చేయాలో అది చేశాను, నాకు పదేళ్ల శిక్ష పడిన విషయం తెలుసు, విమానాశ్రయంలో దిగగానే నన్ను అరెస్టు చేసి చెరసాలకు తీసుకెళ్లుతారని కూడా తెలుసని షరీఫ్ ఓ వీడియో సందేశంలో తెలిపారు. లండన్‌లో చికిత్స పొందుతున్న కుల్సుమ్ నవాజ్‌కు కన్నీటి వీడ్కోలు చెబుతూ తండ్రీకూతుళ్లు స్వదేశానికి బయలుదేరారు. లా¬ర్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు అయిన తర్వాత షరీఫ్, మరియంలను ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇస్లామాబాద్ తరలించనున్నారు. అక్కడ ఉన్న అడియాలా జైలుకు వాళ్లను తీసుకువెళ్తారు. వెన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో అకౌంటబులిటీ కోర్టు షరీఫ్‌కు పదేళ్లు, మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ తీర్పును ఈనెల 6వ తేదీన వెల్లడించారు. మరియం భర్త కెప్టెన్ సఫ్‌దార్‌కు కూడా శిక్షను వేశారు. తండ్రి ఆస్తులను కావాలనే దాచిపెట్టిన కేసులో మరియంకు శిక్షను ఖరారు చేశారు. నవాజ్ షరీఫ్‌కు చెందిన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ ఈనెల 25న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది.