పాఠశాలలకు వరుస సెలవులు

అనంతపురం,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  ఏపీలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు అనూహ్యంగా ఏడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 1నుంచి 8వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో సెప్టెంబర్‌ నెల 1,3,4,6,7,8 తేదీల్లో మొత్తం ఆరురోజుల పాటు స్థానిక సెలవులు ఇస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం  ఇటీవలే  ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే అనంతపురం జిల్లాలో డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతుండడంతో వాటి ప్రారంభానికి ముందురోజు కూడా స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లాకలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో శనివారం కూడా సెలవు ఇచ్చినట్లయింది. అనంతపురం జిల్లావ్యాప్తంగా 398 పరీక్షాకేంద్రాలుంటే పరీక్షలు జరిగే పాఠశాలలు, కళాశాలలతోపాటు, పరీక్షల డ్యూటీకి వెళ్లే ఉపాధ్యాయులున్న విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. మొత్తవ్మిూద మునుపెన్నుడూ లేనివిధంగా ఏకంగా వారం రోజుల పాటు సెలవులు వచ్చాయి.