పాఠశాల అభివృద్ధికి నిరంతరం ప్రభుత్వం కృషి

చేర్యాల (జనంసాక్షి) జూన్ 03 : పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చేర్యాల ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పిటిసి శెట్టె మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్ అన్నారు. శుక్రవారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా  వీరన్నపేట గ్రామ సర్పంచి కొండపాక బిక్షపతి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ మైనర్ రిపేరింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వ సహాయంతో నిరంతరం కృషి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తారిఖ్ అన్వర్, ఎమ్ఈఓ నరసింహారెడ్డి,  డిఈ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు శివ శంకర్ గౌడ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ర యాదగిరి, ఉపాధ్యాయులు రాజేందర్, యాదగిరి, రామచంద్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.