పాఠశాల బస్సులు ఢీ.. పది మంది విద్యార్థులకు గాయాలు
గుంటూరు : కొల్లిపర మండంల దావులూరి గ్రామం వద్ద ఈ ఉదయం రెండు ప్రైవేటు పాఠశాల బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. తెనాలికి చెందిన ఈ పాఠశాలల బస్సులు గ్రామీణ ప్రాంత విద్యార్థులను తీసుకెళ్లెందుకు వచ్చిన క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.