పాఠశాల మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్
కుకునూరుపల్లి మన ఊరు మన బడి పనులను పరిశీలన
కొండపాక (జనంసాక్షి) నవంబర్ 23 : పాఠశాల మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆదేశించారు. బుధవారం కొండపాక మండలం కుకునూరు పల్లి ప్రాథమిక పాఠశాలలో పూర్తి కావచ్చిన మన ఊరు మన బడి పథక పనులను కలెక్టర్ పరిశీలించారు. సుమారుగా 3.02లక్షలతో చేపట్టిన పనులను, పూర్తయిన తర్వాత వేసిన కలరింగ్ లను వీక్షించారు. కలరింగ్ లో కొంచెం నాణ్యతతో ఉండాలని చూడటానికి కార్పొరేట్ పాఠశాల మాదిరిగా కనిపించాలని తెలిపారు. ఎలాంటి చిన్న చిన్న పోరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మకి తెలిపారు. మొత్తం పనులు పూర్తి అయ్యాకా అన్ని సక్రమంగా ఉంటేనే నిర్మాణా ఎజెన్సీలను పూర్తి అయినట్లుగా సర్టిఫికెట్ అందించాలన్నారు. తరగతి గదిలో టూబ్ లైట్లు, ప్యాన్ లు స్వీచ్ వెయుంచి మరీ గమనించారు. పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాంలో వంట గది, వంట సరుకులు, గర్బిణి స్త్రీలకు అందించాల్సిన ప్రోడక్ట్ లను తనికి చేశారు. అంగన్వాడీ పిల్లలు ఎంత మంది పిల్లలు, వారు ఎదుగుదల సంబంధిత ఆరేంజ్, గ్రీన్ జోన్ ఎంత మంది ఉన్నారో ప్రో-చార్ట్, మస్టర్ ల వివరాలను అంగన్వాడీ టీచర్ పరిపూర్ణ కలెక్టర్ కి తెలిపారు. మస్టర్ లో వాడే విధానాన్ని మెరుగుపర్చుకోవాలని అంగన్వాడీ టీచర్ ను హెచ్చరించారు. పాఠశాల ఆవరణ మొత్తం కలియ తిరిగారు. కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. ఎల్లప్పుడూ పరి శుభ్రంగా ఉంచుకోవాలని వారం వారం బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, పాఠశాల ఆవరణలో ఎలాంటి చేత్తా చెదారం ఉండకుండా చుసుకొవాలన్నారు. అవసరం లేని పాత వస్తువులు ఉంటే తొలగించాలని, రాజీవ్ రహదారి ప్రక్కనే ఉన్న పాఠశాల కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు వస్తు ఉంటారని, అన్ని సక్రమంగా ఉంచుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం కొత్తగా నిర్మించిన కుకునూరు పల్లి తహశీల్దార్ కార్యాలయ పనులను పరిశీలించారు. వారి వెంట డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.