పాఠ్యపుస్తకాలు అందించక పోతే
18న డీివో కార్యాలయాన్ని ముట్టడిస్తాం
నర్సంపేట, జూన్ 16(జనంసాక్షి) : ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులక సకాలం లో పాఠ్యపుస్తకాలు అందించక పోతే తమ సం ఘం ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీకున డీివో కా ర్యాలయాన్ని ముట్టడిస్తామని పీడీిఎస్‌యూ డివిజ న్ కార్యదర్శి ఈ.శ్రీశైలం స్పష్టం చేశారు. శనివా రం నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల లో పీడీిఎస్‌యూ ప్రతినిధి బృందం సందర్శించి స ర్వే నిర్వహించింది. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ పాఠశాలలను ప్రారంభమైనప్పటికీ వి ద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫ లం చెందారని ఆరోపించారు. విద్యార్థుల విద్యాభి వృద్దికోసం అన్ని విధాల కృషి చేస్తున్నామని ప్రగ ల్బాలు పలికిన పాలకులు పాఠ్యపుస్తకాల పంపిణీ సకాలంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నర్సంపేట డివిజన్‌లోని వివిధ ప్రభుత్వ పాఠ శాలలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగు నీరు, పక్కా భవనాలు, ఆటస్థలం వంటి సౌకర్యాలు లేక విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్ప టికై నా ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో పీడీిఎస్‌యూ డివిజన్ నాయకులు ఎం డి అభి, నాగేంద్రప్రసాద్, సుమన్, రాజు, ప్రశాంత్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.