పాడిరైతులకు అండగా సిఎం కెసిఆర్‌: లోక

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఇంటికో బర్రె పథకం ద్వారా పాల అభివృద్దికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని టీఎస్‌ డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. మత్స్యకారులను ప్రోత్సహించిన విధంగానే పాడిరైతులను ప్రోత్సహించడం ద్వాకా క్షీర విప్లవానికి తెలంగాణ నాంది కాబోతున్నదని అన్నారు. రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేసే క్రమంలో వారికి ప్రత్యామ్నాయా ఆదాయవనరు చూపాలన్నదే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని బుధవారం నాడిక్కడ అన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. /ూష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, శాసనసభ్యుల సహకారంతో విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాడి రైతులు పాల సేకరణ కేంద్రాలు, డెయిరీలు, పాల శీతలీరణ కేంద్రాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయలని కోరారు.