పాడి పరిశ్రామిభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఖమ్మం, అక్టోబర్ 26 : డిసెంబర్ నెలాఖరులోపు 2829 పాడి గేదెల యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని పశుసంవర్ధకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన సమావేశంలో పాడిపరిశ్రమాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల అమలును సమీక్షించారు. పశుగణ ప్రక్రియ పూర్తయినందున గ్రామాలు మండలాల వారీగా ఆ నివేదికలను అవగాహన చేసుకొని రాబోయే మూడు సంవత్సరాలలోపాలు, మాసం, గ్రుడ్లు ఉత్పతిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు పాల ప్రగతి కేంద్రాల ద్వారా అధిక ఉత్పాదకతనిచ్చే పాడిపశువులను మిల్క్ రూట్క్ అనుసంధానం చేస్తూ క్లస్టర్ల వారిగా యూనిట్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పాడియూనిట్లను లాభాదాయకంగా నిర్వహించేందుకు గోపాలమిత్రులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న పథకాల గురించి ప్రభుత్వ పరంగా జారీ అయిన పాలసేకరణ బిల్లుల చెల్లింపు ఇతర ప్రభుత్వ సహకారం సబ్సిడీలపై గోపాలమిత్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు.