పాతబస్తీలో కార్డన్ సెర్చ్, ఐదుగురు రౌడీషీటర్ల అరెస్ట్

CAERDEN-SEARCH

హైదరాబాద్ కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో సౌత్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా 71 మంది అనుమానితులు, ఐదుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు కూడా ఉన్నారు. అటు సరైన పత్రాలు లేని 70 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.