పాతహావిూలకే దిక్కులేదు
కొత్తగా మేనిఫెస్టో హావిూలా?: సిపిఐ
ఆదిలాబాద్,అక్టోబర్17(జనంసాక్షి): 2014 ఎన్నికల మేని ఫెస్టో హావిూలను నెరవేర్చకుండా కొత్త మేనిఫెస్టోను ప్రకటించడం టిఆర్ఎస్కు మాత్రమే సాధ్యమ్యిందని సిపిఐ విమర్శించింది. ముందస్తు ఎన్నికలకు వఎళ్లి హావిూలను వసి/-మరించిన పార్టీకి ఓట్లు అడిగే నైతికత ఎక్కడిదని అన్నారు. ఏవిధంగా విడుదల చేస్తారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడిని సీఎం చేస్తానన్న హావిూతో పాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలూ నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమకారులను నమ్మించి మోసం చేయడంతో పాటు అవమానించారన్నారు. మహాకూటమిని చూసి కేసీఆర్, కేటీఆర్ భయపడు తున్నారన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చక టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారని అన్నారు. ప్రజలంతా కూటమికి మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. మూడెకరాల భూపంపిణీ పేరుతో 3 లక్షల దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్, కేవలం మూడు వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఉన్న భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారన్నారు. హరితహారం కాస్తా దళితులకు ఉరితాడుగా మారిందని చెప్పారు. పోడు భూములను ప్రభుత్వం లాక్కొంటున్నదని, ఈ అంశంలో గిరిజనులకు తాము అండగా నిలబడ తామని తెలిపారు. సీమాంధ్రుల కంటే అన్యాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీపీఐ నేత తెలిపారు. బ్యాంకుల్లో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కాని కారణంగా తిరిగి వారికి రుణాలు ఇవ్వడం
లేదన్నారు. దీంతో రైతులకు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్దకే వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపారు. రైతులను పట్టించుకోని ఈ సర్కారు హరితహారం పేరుతో హంగామా చేస్తున్నదని విమర్శించారు. ఆ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ డబ్బును దుబారా చేస్తున్నదని తెలిపారు.