పాత్రికేయుడు పై దాడి హేయమైన చర్య
సర్పంచ్ భర్త కిషన్ నాయక్ అనుచరులపై చర్యలు తీసుకోవాలి…
డోర్నకల్ ప్రతినిధి 29 జులై (జనం సాక్షి):
నర్సింహూలపేట, మండలంలోని గోల్ బొడ్క తండా సర్పంచ్ భర్త బాదావత్ కిషన్ నాయక్ మరియు ఆయన అనుచరులైన బాదావత్ రమేష్, భూక్య నరేష్, బాదావత్ జగన్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు చిర్రా సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో నిరసన వ్యక్తం చేసి, నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసన ర్యాలీ నిర్వహించారు. మరియు జర్నలిస్టులపై గోల్ బొడ్క తండా సర్పంచ్ భర్త అనుచరులు దాడిచేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అనంతరం మాట్లాడుతూ.. “అన్యాయాలకు పెద్దపీట, కార్పొరేషన్ లోన్లు అన్ని ఒక గ్రామానికే అత్యధికం, సర్వీస్ బ్యాంక్ మార్చడంలో అంతర్యం ఏమిటి.?” అనే కథనంపై “దీక్ష ప్రభ” జర్నలిస్ట్‌పై నాగేశ్వర్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. విధినిర్వహణలో ఉన్న విలేకరి పై పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడానికి సిగ్గుచేటు అన్నారు. అధికార పార్టీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందనటానికి ఇది ఒక ఉదాహరణని పేర్కొన్నారు. రాజకీయ జోక్యం లేకుండా నేరస్థులను శిక్షించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి అని వారు డిమాండ్ చేశారు. వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్లపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జర్నలిస్టుల భద్రతకు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.