పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

-టిపిటిఎఫ్ జిల్లాఅధ్యక్షులుY.సత్యనారాయణ, పిట్లం,సెప్టెంబర్1,జనంసాక్షి,
కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీం(ఓపిఎస్)ను అమలు చేయాలని కామారెడ్డి టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు Y.సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఆయన గురువారం పిట్లంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికి సామాజిక భద్రత కల్పిస్తూ పాత పెన్షన్ 1980 రూల్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశారని, 2004లో కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను అమలు చేసిందన్నారు. ఇటీవల కాలంలో రాజస్థాన్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశారన్నారు. అదే బాటలో సిపిఎస్ రద్దుకు తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటికే గ్రాట్యుటి ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం కల్పించారని, దీన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ అందరూ కలిసి సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్త ఏం.రామ గౌడ్ , నరేంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి రూప్ సింగ్, పిట్లం మండల శాఖ ప్రధాన కార్యదర్శి గణపతి, హరి సింగ్, బాన్సువాడ మండల ప్రధాన కార్యదర్శి మచ్చందర్, బాధ్యులు నర్సింలు, గోపాల్, కృష్ణ చారి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

తాజావార్తలు