‘పాదయాత్రలు పరువుయాత్రలుగా మారుతయి’: కే తారక రామారావు
కరీంనగర్: రాష్ట్రంలోని పార్టీలు డిసెంబర్ 2న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే వారు చేసే పాదయాత్రలు పరువు యాత్రలుగా మారుతాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారక రామారావు హెచ్చరించారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్ చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో పాల్గొంటూ మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు అనుకులమని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై మళ్లీ దాటవేసే వైఖరి అవలంభించే పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలమని చెప్పకుంటే వారు చేసే పాదయాత్రలను పరువు యాత్రలుగా మారుస్తారని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశానికి హాజరై తెలంగాణపై తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రంలోని పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.