పాన్‌ ఇండియా మూవీ ’టైగర్‌ నాగేశ్వరరావు’


చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌ కీలక భూమిక
హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ’టైగర్‌ నాగేశ్వరరావు’. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై అభిషేక్‌ అగర్వాల్‌ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నుపూర్‌ సనన్‌ గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్‌ లుగా పరిచయం అవుతున్న ఈ మూవీ ద్వారా దర్శకుడిగా వంశీ తెరంగేట్రం చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఓపెనింగ్‌ సెర్మనీతో టాలీవుడ్‌ లో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లలో జరుగుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన కీలక
తారాగణంని చిత్ర బృందం ఎంపిక చేసే పనిలో పడిరది. ఇందులో భాగంగా మంగళవారం క్రేజీ అప్‌ డేట్‌ ని ప్రకటించారు. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్‌ అనుపమ్‌ ఖేర్‌ ని రంగంలోకి దింపేశారు. అనుపమ్‌ ఖేర్‌ తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా ఇది కావడం విశేషం. నిఖిల్‌ నటించిన ’కార్తికేయ2’ తరువాత అనుపమ్‌ ఖేర్‌ తెలుగులో చేస్తున్న రెవడవ సినిమా ఇది. ’టైగర్‌ నాగేశ్వరరావు’ని హిందీ మార్కెట్‌ లోనూ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారట. ఆ కారణంగానే ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ లెజెండరీ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ని ్గªనైల్‌ చేసుకున్నారట. సినిమాకు సంబంధించిన ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 70వ దశకంలో స్టూవర్టుపురం దొంగ
గా పాపులర్‌ అయిన టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని ఓ బయోపిక్‌ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ మూవీలోని టైగర్‌ నాగేశ్వరరావు పాత్ర కోసం రవితేజ బాడీలాంగ్వేజ్‌ గెటప్‌ చాలా భిన్నంగా వుండనుందని తెలుస్తోంది. రవితేజ నటిస్తున్న తొలి బయోపిక్‌ అలాగే తొలి పాన్‌ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల కానుంది.