పాపన్న చౌరస్తాగా ఏర్పాటుకు వినతి పత్రం
వేములవాడ ఆగస్టు 26 జనం సాక్షి : వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ప్రాంతాన్ని పాపన్న చౌరస్తాగా పిలిచేలా అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, కమిషనర్ శ్యాంసుందర్ రావులకు వినతిపత్రం అందజేశారు. గత ఏడు సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని చౌరస్తాలో ఆవిష్కరించడం జరిగిందని, అప్పటినుంచి ప్రజలు పాపన్న చౌరస్తాగా పిలవడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతాన్ని పాపన్న చౌరస్తాగా పేర్కొంటూ అధికారిక ఉత్తర్వులు వెలువడేలా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వేములవాడ నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు