పాపికొండల పర్యాటకానికి కొత్త ఊపు
ఖమ్మం, అక్టోబర్ 25 : జిల్లావాసులు ఎంతగానో ఎదురుచూసిన పాపికొండల పర్యాటక ప్రత్యేక ప్యాకేజీ రెండు సంవత్సరాల తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మొత్తం 90 మంది పర్యాటకులతో రెండు హైటెక్ కోచ్ బస్సుల్లో ఖమ్మం నుంచి సిఆర్‌పురం మండలంలోని పోచవరం వరకు పర్యాటకులు వచ్చారు. ఐటిడిఎ ఆధ్వర్యంలో స్థానిక కొండరెడ్లతో నిర్వహిస్తున్న భద్రాద్రి జలవిహార్ పడవలో వారంతా పాపికొండల్లో విహరించారు. ఈ పర్యాటకానికి పెద్దలకు 800, పిల్లలకు 500 రూపాయల టిక్కెట్ ధర నిర్ణయించినట్లు రామకృష్ణ తెలిపారు.