పారిశుద్ధ్య కార్మికులు లెకుండా స్వచ్ఛ హైదరాబాద్‌ సాధ్యమా?

2

– సర్కారును నిలదీసిన జేఏసీ

– ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా

హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి):

పారిశుధ్య కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయసమ్మతమేనని పలువురు నేతలు పేర్కొన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మిక సంఘాల జెఎసి చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆరు రోజులవుతున్నా ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం పట్ల కార్మిక సంఘం నేతలు..కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సీపీఎం, టిడిపి, సీపీఐ ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ వైఖరిని వీరు తీవ్రంగా తప్పుబట్టారు. కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వారి సమస్యలపై దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు. హైదరాబాద్‌తో పాటు నగరాలు చెత్తతో నిండి కంపు కొడుతున్న పట్టించుకోక పోవడం దారుణమన్నారు. పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయసమ్మతమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వీరి సమ్మెకు సీపీఎం తెలంగాణ కమిటీ సంపూర్ణంగా సమర్థిస్తుందన్నారు.కార్మికులు లేకుండా స్వచ్‌ భారత్‌ జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు.చీపుళ్లు పట్టుకుని ఫోటోలు దిగితే స్వచ్‌ భారత్‌ అయిపోతుందా అని ఆయన అన్నారు. కాంట్రాక్టు మాట వినిపించదని కార్మికులు..ఉద్యోగులు పూర్తి స్థాయి ఉద్యోగిగా ఉంటాడని చెప్పిన మనిషి ఏడాది దాటినా కాంట్రాక్టు కార్మికులు ఎందుకు కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరంలో కంపునకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ బాద్యత వహించాలని తెలంగాణ తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలు మున్సిపల్‌ కార్మికులను నిందించరాదని, దీనికి కెసిఆర్‌ బాద్యత వహించాలని ఆయన అన్నారు.ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్మికుల ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు.  కెసిఆర్‌ తిక్కపనులు చేస్తున్నారని, ఆయన ప్రభుత్వానికి అవసరమైతే ఊడ్చి పారేయడానికి సిద్దంగా ఉండాలని తమ్మినేని పిలుపు ఇచ్చారు. కార్మికులు సమ్మెలో ఉంటే సీఎం కేసీఆర్‌ పంతాలు..పట్టింపులకు పోతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి విమర్శించారు. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని డిమండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వారి సమస్యలపై  చిన్నచూపు తగదన్నారు. తెలంగాణ వస్తే కార్మికులకు కడుపు నిండా భోజనం కలుగుతుందని ఇతరత్రా హావిూలు ఇచ్చారని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రమణ పేర్కొన్నారు. వారికిచ్చిన హావిూలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  జీహెచ్‌ఎంసీ కార్మికుల జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే సీఎం కేసీఆర్‌ ఇంటి ముందు చెత్తవేయిస్తామని టీ టీడీపీ నేత ఎల్‌.రమణ హెచ్చరించారు. ఇందిరాపార్క్‌ దగ్గర జరిగిన జీహెచ్‌ఎంసీ కార్మికుల మహా ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మిక మంత్రి, నేత అయిన నాయిని కార్మికుల పొట్టకొడుతున్నారని రమణ ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ  పారిశుధ్య కార్మికులు కదం తొక్కారు. వారు గత ఆరు రోజులుగా చేస్తున్న ఆందోళనను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ఇందిరాపార్క్‌ వద్ద ఆందోళనకు దిగడంతో ధర్నా చౌక్‌ నిండిపోయింది. వేలాదిగా పారిశుద్ద్య కార్మికులు తరలి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేరకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్ల పరిష్కారానికై మున్సిపల్‌ కార్మికులు గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. దీనితో కార్మిక సంఘం నేతలు కార్మికులతో ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా..ప్రదర్శన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నాకు విపక్ష నేతలు హాజరు అయ్యారు. కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.  పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం వల్ల నగరం కంపు కొడుతోందని, వెంటనే ప్రభుత్వం కార్మిక సంఘ నేతలతో చర్చించి సమ్మెను విరమింప చేయాలని కార్మిక సంఘాల నాయకులు  సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో స్వచ్ఛ హైదరాబాద్‌ పేరుతో పలు హావిూలు ఇచ్చిన సిఎం కెసిఆర్‌ కార్మికుల జీతాల విషయాలను మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇదిలావుంటే  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నగరంలో చెత్త తొలగించడం పోలీసులతో శుభ్రం చేయడం సాధ్యమయ్యే పని కాదని తేల్చిచెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మిక సంఘాలు (జెఎసి) చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మిక సంఘాలను బెదిరింపులతో లొంగదీసుకొనే చర్యలన్నీ పటాపంచలయ్యాయి. బేరసారాలను తిప్పికొట్టాయి. కనీస వేతనాలు ఇచ్చేంత వరకు తాము సమ్మెను విరమించేది లేదని ప్రకటించాయి. కానీ సమ్మెలోకి రెండో రోజు వచ్చిన జీహెచ్‌ఎంసీ మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మధ్యలోనే వెళ్లిపోయింది. సమ్మె ప్రభావంతో నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్థంగా మారిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్‌ఎంసీ అందులో విఫలమైంది. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు స్పష్టం చేశారు. నగరంలోని రాంనగర్‌ లో భారీ ఎత్తున కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాపార్కు వద్ద కార్మికులు భారీ ధర్నా చేపట్‌టారు.   టీఆర్‌ఎస్‌ పార్టీతో తొత్తుగా ఉన్న సంఘం గుర్తింపే లేదని సీపీఎం నేత పేర్కొన్నారు. రెట్టింపు జీతం ఇస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పేర్కొంటున్నారని, ఆ డబ్బులు ఎక్కడవని ప్రశ్నించారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇది సబబు కాదన్నారు. వెంటనే న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.