పార్టీకి దూరమైన వారే దెబ్బతింటారు

ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెదేపా నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం ఉండదని తెదేపా సీనియర్‌ నేత ఎర్రబెల్లి అన్నారు. కడియం శ్రీహరి రాజీనామా నేపథ్యంలో పార్టీ అధినేతతో పలువురు సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. పార్టీకి దూరమైన వారే దెబ్బతింటారని అన్నారు. తెలంగాణపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ఇచ్చే శక్తి ఉన్న కాంగ్రెస్‌ను వీడి తెదేపాపై విమర్శలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసమైతే కడియం శ్రీహరి తెరాసలోకి వెళ్లరని అన్నారు.