పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట

3

వారికి ఓటు వేసే హక్కుంది:హైకోర్టు

హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):  పార్టీ మారిన ఎమ్మెల్యేలు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చని  హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్‌, టిడిపి నుంచి పార్టీ ఫిరాయించిన వారిపై దాఖలైన అర్జీని ఉన్నత న్యాయస్థానం గురువారం  విచారించింది. పార్టీ ఫిరాయించిన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోకుండా ఆదేశాలివ్వాలని టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి తదితరులు  హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఎమ్మెల్యేల ఓటుహక్కు వినియోగంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పార్టీ మారిన వారు ఓటు వేయడంలో సభాపతిదే తుది నిర్ణయమని పేర్కొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓటుహక్కు వినియోగించుకోకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది.

తెలుగుదేశం,కాంగ్రెస్‌ ల నుంచి టిఆర్‌ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో వారి ఓటు హక్కును అడ్డుకోలేమన్నారు. టిడిపి,కాంగ్రెస్‌ ల నుంచి టిఆర్‌ఎస్‌ లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు నిషేధించాలని, ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిని అనర్హులు అవుతారని టిడిపి నేతలు పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో వీరు టిఆర్‌ఎస్‌ కు ఓటు వేయబోతున్న నేపధ్యంలో ఈ తీర్పు రావడం వారికి ఊరట కలిగించే అంశమే. టిఆర్‌ఎస్‌ కు అదనపు ఉపయోగం ఉంటుంది. కాంగ్రెస్‌ నుంచి యాదయ్య,రెడ్యానాయక్‌, విఠల్‌ రెడ్డి, కనకయ్యలు, టిడిపి నుంచి తలసాని శ్రీనివాస యాదవ్‌, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు టిఆర్‌ఎస్‌ లో చేరార