పార్టీ వీడుతానన్న ప్రచారం అబద్దం
తాను స్టార్ కాంపెయినర్ అన్న కోమటిరెడ్డి
న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): కాంగ్రెస్ను వీడుతున్నట్లు సోషల్ విూడియాలో వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. గురువారం
ఆయన ఢల్లీిలో తనను కలసిన విూడియాప్రతినిధులతో మాట్లాడుతూ…. పార్టీ మార్పు అంశంపై కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా తమ్ముడు రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంలో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. పార్టీకి విధేయునిగా, పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేస్తానన్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ను నేను… నేను ఎందుకు పార్టీ మారుతానని ఎదరు ప్రశ్నించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలవడం తప్పు కాదు. నేను పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా ప్యామిలీపై రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను పార్టీ మారుతున్నట్లు చెప్పే వారికి లీగల్ నోటీసులు పంపుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.