పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం

పార్లfotorcreated36మెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభలో చైర్మన్ హమీద్ అన్సారీ అధ్యక్ష స్థానాలలో ఉన్నారు. ఉభయ సభలలోనూ విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించి ప్రశ్రోత్నరాల కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద నోట్ల రద్దుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని కోరుతూ లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానంపై చర్చను చేపడతానని స్పీకర్ పదే పదే చెప్పినా విపక్షాలు తమ ఆందోళన వీడటం లేదు. ప్రసిద్ధ సంగీత విద్యాంసుడు మంగళం పల్లి బాలమురళీ కృష్ణ మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే బాలమురళీకృష్ణ మృతికి సంతాప సూచకంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది.