పార్లమెంట్‌లో టీ కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు తొలి రోజే తెలంగాణ సెగ తగిలింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూ నిలబెట్టుకోవాలని డిమాాం చేశారు. పార్లమంఎట్‌
బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి రోజే టీ-ఎంపీలు తెలం”గానాన్న్ణి వినిపించారు. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఎంపీలు గుత్తా సుఖేందంరెడ్డి, పొన్నం ప్రభాకం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాజయ్య, వివేచీ తదితరులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాాం చేశారు. 2009 డిసెంబం 9న కేంద్రం తెలంగాణను ప్రకటించిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే రాష్టాన్న్రి ఏర్పాటు చేసి హావిూని నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ మాట ఇచ్చిందని గుర్తు చేస్తూ ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీపై అన్నారు. సమావేశాల ప్రారంభానికి ముందే తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనలకు దిగడంతో హైకమాాం అప్రమత్తమైంది. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సమయంలోనూ వారు ఆందోళన చేపడితే ఇబ్బందులు తప్పవని భావించిన అధిష్టానం కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక ఇన్‌చార్జి వాయలం రవిని రంగంలోకి దించింది. దీంతో రవి టీ-ఎంపీలను తన వద్దకు పిలిపించుకొని మాట్లాడారు. సభలో ఆందోళన చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అధికార పక్షంలో ఉండి మనమే ఆందోళన చేస్తే.. విపక్షాలకు అస్త్రం అంధించినట్లవుతుందని వివరించారు. తెలంగాణపై సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయని, వీలైనంత త్వరగా ప్రకటన చేసేందుకు హైకమాాం సన్నద్ధమవుతోందని ఎంపీలకు వివరించారు. ఇన్నాళ్లు ఓపిక పట్టారని, మరికొద్ది కాలం ఓపికతో ఉండాలని సూచించారు.