పార్లమెంట్‌లో వస్తుసేవల బిల్లు

4

– ‘సై’ అన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ,మే5(జనంసాక్షి):  వస్తుసేవల పన్నుకు సంబంధించిన బల్లు పార్లమెంటుకు చేరింది. దీనిని జైట్లీ ప్రవేశ పెట్టారు. దయచేసి బిల్లుకు సహకరించండని  ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కాంగ్రెస్‌ కు  అభ్యర్థన చేశారు.  కీలకమైన గ్సూా అంా సర్వీస్‌ ట్యాచ్సీ(జీఎస్టీ) బిల్లు మంగళవారం లోచీ సభకు వచ్చిన సందర్భంగా జైట్లీ ఈ మేరకు కాంగ్రెస్‌ కు విన్నవించారు. అప్పటివరకూ ఆ బిల్లుపై  కాస్త వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్‌ మెత్తబడింది. దీంతో పార్లమెంట్‌ లో జీఎస్టీ బిల్లుకు మూడింట రెండొంతల మెజార్టీ లభించి బిల్లు ఆమోదం పొందింది.  సందర్భంగా అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలైతే రాష్ట్రాలు  ముందడుగు వేస్తాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ మద్దతు తెలపడానికి కారణం ఇది తమ ప్రభుత్వ ఆలోచనేనని కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మద్ధతు తెల్పడంతో వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి మార్గం సుగమమైంది. వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడ్తూ ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ ఏకీకృత పన్ను విధానానికి తోడ్పడే దీని ఆమోదానికి మధ్ధతివ్వాలని ప్రతిపక్షాలను అభ్యర్థించారు. ఈ బిల్లు ఆమోదానికి తమ పార్టీ మద్ధతిస్తుందని కాంగ్రెస్‌ సీనియం నేత వీరప్ప మొయిలీ విూడియాతో పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. లోచీ సభ మరో మూడు రోజులు మాత్రమే కొనసాగనుంది. రాజ్య సభ సమావేశాలు మే 18న ముగియనున్నందున వస్తుసేవల పన్ను బిల్లుపై లోచీ సభలో బుధవారం  ఓటింస్త్ర చేపట్లే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే దేశ రాజధాని దిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా గుర్తించడానికి ఎటువంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమ్‌ఆద్మీపార్టీ దిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా గుర్తించాలని డిమాాం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి ప్రతిపాదనలు తమ వద్ద లేవని కేంద్రం స్పష్టం చేసింది. దిల్లీ లోచీసభ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే దిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ఆమోదిస్తామని ఎన్నికలకు ముందు భాజపా కూడా హావిూ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే.