పార్లమెంట్‌ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయి : చిదంబరం

న్యూఢిల్లీ : శ్రీలంకలో తమిళుల అంశంపై పార్లమెంట్‌ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వెల్లడించారు. శ్రీలంకలో యుద్ధ నేరాలపై ఐరాస మానవ హక్కుల మండలిలో తీర్మానం కోరతామని తెలిపారు. అమెరికా తీర్మానంలో సవరణలు కోరనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై డీఎంకే నేతలతో చర్చలు జరిపినా… ఆ పార్టీ తన వైఖరి ఎందుకు మార్చుకుందో తెలియట్లేదని అన్నారు. శ్రీలంక తమిళుల అంశంపై కాంగ్రెస& పార్టమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తావించారని చెప్పారు. శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనపై నిష్పక్షపాత దర్యాప్తునకు సోనియా డిమాండ్‌ చేశారని పేర్కొన్నారు. డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి కేంద్రానికి రాసిన లేఖపై ఈ నెల 18 చెన్నై వెళ్లి ఆ పార్టీతో చర్చించినట్లు చెప్పారు.