పార్లమెంట్‌ పరిధిలో ఎన్ని గ్రామాలున్నాయో, సమస్యలేంటో తెలుసా..?

బహిరంగ చర్చకోసం లోక్‌సత్తాకు, వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంఘానికి లేఖరాశాం

దమ్ముంటే ఎంపిని తీసుకురా…

మేయర్‌ రవిందర్‌ సింగ్‌పై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌

కరీంనగర్‌,అక్టోబర్‌ 26(జ‌నంసాక్షి): ప్రోటోకాల్‌ గురించి గొప్పగా మాట్లాడుతున్న నగర మేయర్‌ సర్దార్‌ రవిందర్‌ సింగ్‌ ఇటు అలుగునూర్‌, అటు తీగలగుట్టపల్లె, ఇంకోవైపు పద్మనగర్‌, నాలుగోవైపు వర్క్‌షాప్‌ దాటితే కూడా చెల్లని రూపాయివేననే విషయాన్ని ముందు అవగాహన చేసుకోవాలని, మాజీ ఎంపికి ప్రోటోకాల్‌ కంటే పెద్దని చెప్పేందుకు సిగ్గుగా లేదని కాంగ్రెస్‌ నేతలు మేయర్‌పై నిప్పులు చెరిగారు. స్థానిక అర్‌అండ్‌బివ సతి గృహంలో పాత్రికేయుల సమావేశంలో నగర అద్యక్షుడు కర్ర రాజశేఖర్‌, కార్పోరేషన్‌ ప్లోర్‌లీడర్‌ ఆకుల ప్రకాశ్‌, జిల్లా అదికార ప్రతినిధి న్యాయవాది రత్నాకర్‌, బీసీ, ఎస్సీసెల్‌ జిల్లా అద్యక్షులు మదు, రవి లు గురువారం మాట్లాడుతూ మాజీఎంపి చెప్పినప్రకారం చర్చకుదమ్మంటే ఎంపి వినోద్‌ కుమార్‌ను తీసుకుని రావాలని అంతే తప్ప చర్చనుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప టీఆర్‌ఎస్‌లో దమ్ముధైర్యంలేదన్నారు. జిల్లాకుచెందిన ప్రజా ప్రతినిధులంతా కూర్చుని ఎంపిని ఒప్పించి పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు చర్చకు తీసుకురావాలీని తిరిగిసవాల్‌ విసిరారు. వేదిక తేదీ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంఘం రాష్ట్ర జిల్లా అద్యక్షులు శేఖర్‌, కరుణాకర్‌లకు లోక్‌ సత్తా జిల్లా అద్యక్షుడు ఎన్‌ శ్రీనివాస్‌కు లేఖరాసినప్రతులను పత్రికలకు విడుదల చేశారు. సుహృద్బావ వాతావరణంలో ఏవరేం చేశాం, ఇంకా ఎందుకు రావాల్సినవి రాలేదనే అంశాలపై బహిరంగంగా చర్చించుకుం దామన్నారు. ఎంపికి ఎందుకు దైర్యం రావడంలేదన్నారు. ప్రతిదానికి ముందుకు ఉరికి వస్తున్న రవిందర్‌ సింగ్‌ కనీసం నగరంలో జరిగే అభివృద్దిపైనైనా మాట్లాడేదమ్ము దైర్యం ఉందాన్నారు. ఎక్కడ ఏరోడ్డు బాగుంది, ఎక్కడ డ్రైనేజి మంచిగుంది, వీది దీపాలు సరిగా వెలు గుతున్నాయా., పారిశుద్య కార్మికులకు వేతనాలిచ్చే శక్తి కూడా లేని అసమర్త ప్రభుత్వం లో మేయర్‌గా ఉన్నందుకు సిగ్గుగా అనిపించడం లేదా అన్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నీపైన నీ పాలకమండలిపై విశ్వాసం ఏమేరకు ఉందో ఇట్టే కనిపిస్తుందని నిధులన్ని కూడా ఇతర శాఖలకు కేటాయిస్తే కనీసం ప్రభుత్వం వద్ద పోరాడే శక్తి లేని నువ్వు పార్లమెంట్‌ స్థాయి గురించి చర్చకు వస్తానంటే నీస్థాయి ఎలా అవుతుందో రాత్రిపూట చీకటిగదిలో కూర్చుని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కనీసం పార్లమెంట్‌లో ఏగ్రామంలో ఏసమస్యలున్నా యో, ఏన్ని గ్రామాలున్నాయో కూడా నీకు తెలుసాని ప్రశ్నించారు. అవాకులు చవాకులు పలుకడం మానుకుని ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కూడా వెంటనే ఎంపిని ఒప్పించి బహిరంగ చర్చకు తీసుకురావాలన్నారు. ఏట్లో ఏరలేనోడు కూట్లో ఏదో ఏరుతానంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు రాజకీయ నాయకులు లేరనే విషయాన్ని మేయర్‌ గుర్తుంచుకోవాలన్నారు. ఊ అంటే చిందులు వేస్తున్న కార్పోరేటర్‌ సునీల్‌ రావుకు ఏమాత్రం నైతిక హక్కు లేదన్నారు. అదికారం ఎక్కడుంటే అక్కడ చాకిరి చేయడం తప్ప ఇంకోటి రానే రాని నువ్వు మాజీ ఎంపిని విమర్శిస్తావా అని నిలదీశారు. ఆనాడు ఎంపిగా ఉన్న ప్రభాకర్‌ కారు డోర్‌ తీసిన రోజులు కూడా కాంగ్రెస్‌ నేతలకు కార్యకర్తలకు ప్రజలకు తెలుసని, నేడు ఎంపిని మచ్చిక చేసుకునేందుకు మాజీ ఎంపిపై విమర్శలు గుప్పించే స్థాయి నీది కానే కాదన్నారు. ఇద్దరు కూడా నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. సమావేశంలో కార్పోరేటర్‌ అజిత్‌రావు, వెంకటరమణ, బాసెట్టి కిషన్‌, రవిందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.