పార్లమెంట్‌ సాక్షిగా.. తెలంగాణపై విషం చిమ్మిన మోడీ


` నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అవమానం
` నేడు రాష్ట్రం వచ్చినా సంబరాలు చేసుకోలేదని తప్పుడు ప్రచారం
` రక్తపుటేరులు పారాయని రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు
` ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బయటపడ్డ బిజెపి రాజకీయ దురుద్దేశం
న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి):ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణపై మరొకసారి విషం చిమ్మారు. గతంలో మాదిరిగానే ఉద్యమ గడ్డ విూద తన అక్కసు వెళ్ళగక్కారు. రాష్ట్ర విభజన సరిగ్గా లేదని గతంలోనూ పదే పదే ప్రస్తావించిన ఆయన.. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ స్వార్ధ రాజకీయం కోసం విభజన అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. మణిపూర్‌ అంశంపై యావత్‌ దేశ ప్రజానీకం అట్టుడికినా ఎంతకూ స్పందించని మోడీ.. రాష్ట్ర విభజన అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడం చర్చకు దారితీస్తోంది. ప్రశాంతంగా కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య నిప్పు రాజేసి చలిమంట కాచుకోవాలని బీజేపీ యత్నిస్తోందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.మోడీ ఏం మాట్లాడారంటే.. ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదంటూ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల రెండు రాష్ట్రాల్లో సంబరాలు జరగలేదన్నారు. ఈ విభజన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణవర్గాలకు సంతృప్తి కలిగించలేకపోయిందన్నారు. ఉత్తరాఖండ్‌, రaార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని చెప్పారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా, నేటినుంచి నూతన పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీంతో పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని లోక్‌ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంలో ఏపీ, తెలంగాణ విభజనపై మాట్లాడారు.రక్తపుటేరులు పారాయి..యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్‌ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. అయితే ఉత్తరాఖండ్‌, రaార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికాబద్ధంగా చేశారని గుర్తుచేశారు. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు. కానీ ఏపీ, తెలంగాణ విభజన సమయంలో ఎక్కడా సంబరాలు జరగలేదన్నారు. ఈ విభజన రెండు తెలుగు రాష్ట్రాలను సంతృప్తి పర్చలేకపోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయన్నారు.గతంలోనూ అక్కసు వెళ్లగక్కిన మోడీ.. గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన సమావేశాల్లోనూ ఏపీ, తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదన్నారు. స్వార్థరాజకీయాల కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను హడావుడిగా విభజించారని, కేంద్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీని ఎంతో సిగ్గు పడే విధంగా కాంగ్రెస్‌ విభజించిందన్నారు. మైకులు ఆపేసి, పెప్పర్‌ స్ప్రే జల్లి అత్యంత సిగ్గుచేటుగా చేశారు. విభజన సమయంలో చాలా కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందని, కానీ కాంగ్రెస్‌ మాత్రం అలా చేయలేదన్నారు. విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే ఏపీ, తెలంగాణ విభజన చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ చాలా కీలకంగా ఉంటుందన్నారు. అలాంటి వ్యవహారాన్ని సాదాసీదాగా చేశారన్నారు. వాజ్‌ పేయ్‌ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని, ఎక్కడా చిన్న సమస్య కూడా రాలేదన్నారు. కాంగ్రెస్‌ హడావుడిగా చేసిన విభజనతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం జరిగిందని ప్రధాని మోడీ అన్నారు.