పాలకుల విధానాలతో విద్యావ్యవస్థ నిర్వీర్యం

ఖమ్మం, జనవరి 30 (): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా రాష్ట్రంలోని జిల్లా కార్యదర్శి వేణు విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఏపీటీఎఫ్‌ పాఠశాలలను మూసి వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థులు లేరనే నెపంతో కొన్ని పాఠశాలలను మూసివేస్తే ఏజెన్సీ ప్రాంతంలోని పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. విద్యకోసం రూ.28వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పాలనాపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.