పాలిక అర్జున్ సేవలు మరువలేనివి

గ్రామాభివృద్ధికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు
కోదాడ టౌన్ జూలై 29 ( జనంసాక్షి )
విలువలకు క్రమశిక్షణకు పద్ధతిగా పార్టీకి కట్టుబడి ఉండి గ్రామ అభివృద్ధి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు పాలకి అర్జున్ అని మాజీ టీపీసీసీ అధ్యక్షులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు అన్నారు.శుక్రవారం కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో అర్జున్ నివాసంలో ఏర్పాటు చేసిన సంతాప సభ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు తను పార్లమెంటు సమావేశాల్లో ఉండగా అర్జున్ మారణ వార్త తనను ఎంతో కలచి వేసిందని తను రాజకీయాల్లోకి వచ్చిన నాటినుండి తన వెన్నంటే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు అహర్నిశలు కృషి చేశారని అన్నారు.అర్జున్ మరణం తనకు వ్యక్తిగతంగాను  కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమానులు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, తుమాటి వరప్రసాద్ రెడ్డి,దొంగరి వెంకటేశ్వర్లు, యారగని నాగన్న గౌడ్, చింతలపాటి శ్రీనివాసరావు, గంధం యాదగిరి బాల్ రెడ్డి,సంపేట ఉపేందర్ గౌడ్, బాగ్దాద్,గద్దల వెంకటేశ్వర్లు,పాలకి సురేష్ ,హనుమంతరావు, కోటిరెడ్డి, ముస్తఫా,బాబా, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area