పాలిటెక్నిక్ విద్యార్థులతో చలగాటమాడుతున్న సాంకేతిక విద్యాబోర్డు
రెండో కౌన్సిలింగ్‌కు జాప్యంతో కళాశాలల్లో హాజరుశాతం శూన్యం
తప్పని పరిస్థితిలో ఆన్‌లైన్‌లో జాయినింగ్ రిపోర్ట్‌చేసిన విద్యార్థులు
జూన్ రెండోవారం అనడంతో త్రిశంకుస్వర్గంలో విద్యార్ధులు
రెంటికి చెడ్డ రేవడిగా మారిన వైనం
కరీంనగర్,జూన్15(జనంసాక్షి): తెలంగాణాలో ఇప్పుడిప్పుడే సాంకేతిక విద్యకు ఆదరణ లభిస్తోంది. నిన్నమొన్నటివరకు కేవలం బీటెక్, ఐటీఐలకు మాత్రమే ప్రాధాన్యత నిచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులు గత రెండేల్లుగా పదవతరగతి తర్వాత పాలిటెక్నిక్‌పై మక్కువ చూపిస్తున్నారు. దీనికి కారణాలనేకం ఉంటున్నాయి. లక్షలాది మంది ఇంటర్ తర్వాత బీటెక్ ఇంజనీరింగ్ చదివి పట్టాలు పుచ్చుకున్నాకూడా కంపెనీల అవసరాలకు అనుగుణం గా తయారు కావడంలేదు. దీంతో పుట్టగొడుగుల్లా వచ్చిన సంస్థల్లో నాణ్యతలేని విద్యను అభ్యసించి అటు కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగాల కు ఎంపిక కాక చెల్లాచెదురుగా మారుతున్నాయి విద్యార్థుల జీవితాలు. ఈదశలో పదవతరగతి తర్వాత చదివే విద్యలో పాలిటెక్నిక్ డిప్లోమా కు చాలామంది ఆసక్తి చూపించడమేకాక ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల నిపుణులు చెపుతున్న ప్రకారం ఆలోచించినా ఇంజనీరింగ్ ఆయా కోర్సులపైనా, అంశాలపైనా మంచి పట్టు లభిస్తుందని, ఇంజనీరింగ్ చేసేవారు పాలిటెక్నిక్‌ను ఎంచుకుంటేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితె గంపెడాశతో ఎంతో కష్టపడి పాలిసెట్ రాసి పరీక్షలు రాసిన వారికి ఎలాగోలా కౌన్సిలింగ్ నిర్వహించిన సాం కేతిక విద్యాబోర్డు కవిూషనర్ కార్యాలయ అధికారులు సీట్లకేటాయింపుల్లో ఇస్టారీతిలోకేటాయించడంతో చాలామంది విద్యార్థులకు గుదిబం డగా మారింది.ఆన్‌లైన్ విదానాన్ని అమలుచేస్తున్న యంత్రాంగం సీటుఅలాట్ చేసినవారిని చాలన్ చెల్లించే విదంగా వారే ఆన్‌లైన్‌లో అన్ని పూర్తి చేసి పంపించారు. ఆచానల్ అటు ఆన్‌లైన్‌లో చేరగానే విద్యార్థులను సెల్ఫ్ రిపోర్టింగ్ విదానం పేరుతో ఆన్‌లైన్‌లోనే చేయించింది. అయితే ఈనెల 9వతేదీన చివరి తేదీ అని ఆరోజు చాలన్ కట్టిన వారంతా ఆయా కళాశాలలకు వెల్లి జీరాక్స్ పత్రాలను సమర్పించాలని సూ చించింది. ఈసందర్బంలోనే మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు అలాట్ చేసిన ప్రదేశాల్లో చదువాల్సిన అవసరం లేదన్నట్లుగా విద్యార్థుల కు అవకాశం ఇస్తూనే రెండో విడత కౌన్సిలింగ్ తేదీలను నెలన్నరకు వాయిదా వేయడంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 9వ తేదీతో విద్యార్థులకు గడువు ముగియడంతో కనీసం 13వతేదీన మల్లీ రెండవ విడత కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ వస్తుందని భావించిన వేలా ది మంది విద్యార్థులు నేడుగుడ్లప్పగించుకునిచూస్తున్నారు. దీంతో 13వతేదీనుంచి తరగతులు నిర్వహించాలని ఆయా కళాశాలల ప్రిన్సి పాళ్లను ఆదేశించినప్పటికి విద్యార్థుల హాజరు శాతం వారికి ఆశించినంత లేకపోయేసరికి ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలోనే సాంకేతిక విద్యాశాఖ అధికారులు రెండవ విడత కౌన్సిలింగ్ జూలై రెండవ వారంలో ఉంటుందనే విధంగా ప్రకటన జారీచేశారు. అంతసమయం వర కు అంటే కనీసం 40 నుంచి 45 రోజులు, ఇదికూడా పోతే రెండు నెలల పాటు విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా పోతోంది. ఆన్ లైన్ విధానంవల్ల చాలామంది రెండవ విడతలో తమకు దగ్గరి కళాశాలల్లో ఆప్షన్ ఇచ్చుకుని చదువులు కొనసాగించవచ్చనే ఆశతో ఉన్నా రు. సాంకేతిక విద్యాశాఖ అధికారుల నిర్ణయం ఇటు విద్యార్థులకు భారంగా పరిణమించింది. తలాతోక లేనట్టుగా సీట్లను కేటాయించడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితిలో కోట్టు మిట్టాడుతున్నారు. తెలంగాణాలో మొత్తం
ప్రభత్వ, ప్రైవేట్ కలిపి 50వేల 632 సీట్లుండగా ఇందులో సుమారు 40వేల మంది సర్టిఫికెట్లను వెరిఫై చేయించుకుని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇందులో 37వేల467 మంది మాత్రమే తమకు ఆన్‌లైన్‌లో చాలన్‌లు చెల్లించారు. అంటే సుమారు 8177 మంది విద్యార్థులు ముందుగానే సీట్లను కేటాయించిన విదానంపై అసం తృప్తి వ్యక్తం చేస్తూ చాలన్‌లు కూడా చెల్లించనేలేదు. చెల్లించిన వారు కూడా చాలామంది ఆయా కళాశాలల్లోకి వెల్లిన దాఖలాలు కూడా లేదు. ఆన్‌లైన్‌లో చాలన్‌కట్టగానే సెల్ప్ రిపోర్ట్ చేసినట్లుగా జనరేట్ కావడంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు కేటాయింపు పొందిన వారు వందశాతంచేశారు. మొత్తం 205 పాలిటెక్నిక్ కళాశాలల్లో 13వేల 165 సీట్లు ఖాలీఆ మిగిలిపోతున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వ కళాశాలలు 56 ఉండగా 11వేల 632 సీట్లు ఉండగా ఇందులోకూడా 11వేల381సీట్లు మాత్రమే కేటాయించారు. అలాగే రెండు ఎయిడెడ్ కళాశాలల్లో 420 సీట్లు ఉండగా 420మందికి సీట్లు కేటాయించారు. ఇక ప్రైవేట్ విషయానికి వస్తే 147 కళాశాలలుండగా 38వేల 580 సీట్లున్నాయి. ఇందులో ఆన్‌లైన్‌లో సీట్ల కేటాయింపు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసినవారు కేవలం 25వేల 666మంది మాత్రమేనని అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇందులో కూడా చాలా మంది మార్పుకు అవకాశం ఉంటుందని ఎదిరి చూస్తుండగా అలాంటి పరిస్థితి ని కల్పించలేకుండా వ్యవహరిస్తున్నారు కవిూషనరేట్ అధికారులు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినవా రికి వారి వారి స్వస్థలాలు చూడకుండా గుడ్డిగా సీట్లు కేటాయిస్తూ పోవడంతో ఈసమస్య ఉత్పన్నం అవుతుందనేది వాస్తవం. కళాశాలల్లో 13వతేదీనుంచి తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపాల్లను ఆదేశించినప్పటికి అవి అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. 13, 14 తేదీలలో ఆయా కళాశాలలకు కేటాయించిన వారిలో కనీసం 10శాతం మంది విద్యార్థులు కూడా రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ప్రిన్సిపాల్ల పరిస్థితి మిగిలిపోగా, విద్యార్థుల పరిస్థితి నెలకొంది. ప్రబుత్వం వెంటనే ఆలోచించి రెండవ విడత కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిం చి విద్యార్థులకు కళాశాలలను మార్చుకునే అవకాశం కల్పిస్తే విద్యార్థులకు లాభం జరుగడమేకాక కళాశాలల్లో తరగతులు కూడా సవ్యంగా జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పాలిటెక్ని క్‌లలో కూడా సీట్లు ఖాళీగా మారే విదంగా అధికారుల చర్యలు కనిపిస్తున్నాయనేది వాస్తవం. ప్రస్తుతం అధికారులు వ్యవహరిస్తున్న తీరువ ల్ల ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వచ్చినవారు కూడా స్థానికంగా ఉండే ప్రైవేట్ యాజమాన్యాల తో సంప్రతింపులు జరుపుకుని కొనసాగేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మల్లీ బొక్కగా మారే ప్రమాదం లేకపోలే దు. 13వతేదీనుంచి తరగతులు ప్రారంబిస్తున్నా మని చెప్పడంతో కేటాయించిన ప్రదేశాల్లోకి వెల్లే పరిస్థితిలేకుండా పోతోందని ఉన్న చోట చదువుకునే అవకాశంలేకుండా చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అటుహాజరుశాతంకూడా సమస్యగా మారనుందనేదిమరో అంశం. అధికారులు కాలయాపనచేస్తూ రెండవ విడత కౌన్సిలింగ్ జాప్యం చేస్తుండడంతో విద్యార్థులు చేరేపరిస్థితిలేకుండా పోతోంది. దీనివల్ల భవి ష్యత్తులో హాజరుశాతం సమస్యగా మారనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెంటికి చెడ్డ రేవడిగా మారిన విద్యార్థులు
ఎంతో మంచి ఉద్దేశ్యంతో సాంకేతిక విద్యను ఎంచుకుని తమకు అనుకున్న కోర్సును చదివేందుకు ఇంటర్‌ను కాదని పాలిటెక్నిక్‌కు వచ్చిన 37వేలమంది విద్యార్థుల పరిస్థితి నేడు అధికారుల చర్యలవల్ల ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇప్పటికే ఇంటర్ లో చేరేఅవకాశాన్నికూడా వారు కోల్పోవాల్సివచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో తరగతులు ప్రారంభమై వారం పది రోజు లైంది.ఇటు పాలిటెక్నిక్ విద్యను చదువుకుందామంటే అనుకున్న ప్రదేశంలో కాకుండాదూరం దూరంగాకళాశాలలు కేటాయించడంతో అక్క డికెల్లి చదువుకునే పరిస్థితిలేకుండా పోయింది. రెండవవిడత కౌన్సిలింగ్‌కు అవకాశంఇస్తారనుకుంటే అలాకాకుండా చేయడంతో సమ యం కాస్తా వృదాగా పోతోందనే ఆవేదనవ్యక్తం అవుతుంది. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వెంటనే రెండవవిడత కౌన్సి లింగ్ తేదీలను ప్రకటించి వారి వారి ప్రదేశాలకు సవిూపంలోని కళాశాలల్లో చేరేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు.