పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు
పాల్వంచ : ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. కోటిన్నరతో నిర్మించిన నూతన భవన నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్ బాపురెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక పత్రాలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.